షాకిచ్చిన అలోక్ వర్మ..! పదవికి రాజీనామా వెనుక అసలు కుట్ర ఇదే..?..!

షాకిచ్చిన అలోక్ వర్మ..! పదవికి రాజీనామా వెనుక అసలు కుట్ర ఇదే..?..!

షాకిచ్చిన అలోక్ వర్మ..! పదవికి రాజీనామా వెనుక అసలు కుట్ర ఇదే..?..!
షాకిచ్చిన అలోక్ వర్మ..! పదవికి రాజీనామా వెనుక అసలు కుట్ర ఇదే..?..!

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే మోదీ ప్రభుత్వం ఆయనను అగ్నిమాపక విభాగం డీజీగా బదిలీ చేసింది. ఆయన ఈ బాధ్యతలు చేపట్టకుండానే.. శుక్రవారం రాజీనామా చేశారు. 2017 జూలై 31తోనే ఆయన రిటైర్‌మెంట్‌ వయసు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను అదే సంవత్సరం జనవరిలో సీబీఐ డైరెక్టర్‌గా నియమించింది.

నిబంధనల ప్రకారం రిటైర్‌మెంట్‌ వయసుతో సంబంధం లేకుండా ఆ పదవిలో రెండేళ్లపాటు.. అంటే ఈ నెలాఖరు వరకు ఆయన కొనసాగించాల్సి ఉంది. ఆయన తన రాజీనామా లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘దిగువ సంతకం చేసిన వ్యక్తి రిటైర్‌మెంట్‌ వయసు దాటినందున.. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా అర్హుడు కాడు. రిటైర్‌ అయినట్లుగా భావించగలరు’’ అంటూ లేఖ చివర్లో సంతకం చేశారు. ‘‘ఒకే ఒక వ్యక్తి.. అది కూడా నన్ను దెబ్బతీయాలనుకునే వ్యక్తి చేసిన తప్పుడు, నిరాధారమైన, చిల్లర ఆరోపణలతో నన్ను బదిలీ చేశారు. ఇది విషాదకరం’’ అని అలోక్‌వర్మ.. ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, జస్టిస్‌ సిక్రీ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ భేటీలో అసలేం జరిగింది? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీవీసీ నివేదిక ఆధారంగానే వర్మకు ఉద్వాసన పలకాలని ప్రధాని మోదీ, జస్టిస్‌ సిక్రీ తీర్మానించారు. ఈ నివేదికలో వర్మపై పది ఆరోపణలున్నాయి. వీటిలో ఏడు ఆరోపణలు నిరాధారం కాగా.. మూడు మాత్రమే ‘పరిగణన’లోకి తీసుకోదగ్గవని తేలింది.

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు మొదటిసారి బాధ్యతలు చేపట్టగానే డజను మంది అధికారులను తలోచోటికి బదిలీ చేశారు. వారిలో… అలోక్‌వర్మ అనుకూలురే ఎక్కువమంది! సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ నెల 9న మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వర్మ ఆ బదిలీలను రద్దు చేశారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో గురువారం రాత్రి మళ్లీ నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ అయ్యారు! ఆ మరుసటి రోజునే వర్మ ఉత్తర్వులను రద్దు చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాకు ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలపై ఆయన విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ అస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌, మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. క్రిమినల్‌ దర్యాప్తు నుంచి అస్థానాకు ఊరట కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా జస్టిస్‌ నజ్మీ వజీరీ కొట్టివేశారు. దీంతో అస్థానాను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *