బ్రేకింగ్ : వైసీపీకి కీలకనేత గుడ్‌ బై!

బ్రేకింగ్ : వైసీపీకి కీలకనేత గుడ్‌ బై!

బ్రేకింగ్ : వైసీపీకి కీలకనేత గుడ్‌ బై!
బ్రేకింగ్ : వైసీపీకి కీలకనేత గుడ్‌ బై!

ఏపీ విపక్షం వైసీపీకి కీలక నేత గుడ్‌ బై చెప్పనున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, వైసీపీ క్రియాశీలక నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఆదిశేషగిరిరావు సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో ఆయన రాజీనామా చేయనున్నారని తెలిసింది. సీఎం చంద్రబాబుకు ఆదిశేషగిరిరావు దగ్గర బంధువు. తన సోదరుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడు జయదేవ్‌ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా, బంధుత్వాన్ని పక్కనపెట్టి మరీ వైసీపీ విజయానికి 2014లో ఆయన కృషి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *